నేటి యువతకు స్ఫూర్తి భగత్ సింగ్ :
DYFI, JVV, SFI
ప్రొద్దుటూరు పట్టణంలోని గీతాంజలి పాఠశాల లో 92భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం జెవివి రాష్ట్ర కార్యదర్శి టి. సురేష్ రెడ్డి, డి.వై.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్ రాజ్ , ఎస్ఎఫ్ఐ కార్యదర్శి సురేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారుడు భగత్ సింగ్ అని, ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడ్డాడన్నారు. భగత్ సింగ్ మరణం భారత స్వాతంత్రోద్యమం కొనసాగింపుకు సాయపడేలా వేలాది మంది యువకుల్లో స్ఫూర్తిని నింపిందని, ఆయన ఉరి అనంతరం ఉత్తర భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ప్రభుత్వమునకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయని గుర్తు చేశారు.
నేటికీ భారత యువత భగత్ సింగ్ నుండి ఎంతో స్పూర్తిని పొందుతున్నారని, భగత్ సింగ్ సమకాలీన భారతదేశంలోనే కాక స్వాతంత్య్ర అనంతర భారతదేశంలో కూడా విప్లవానికి చిహ్నంగా ప్రసిద్ధిచెందారన్నారు. నేడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆ విప్లవ వీరుడికి విప్లవ జోహార్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గీతాంజలి కరస్పాండెంట్ శివరామిరెడ్డి, సురేష్ సింగ్, చెన్నయ్య, శివ, మళ్లీ, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Comments