రాయచోటి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నేడు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల లవకుమార్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 91వ వర్ధంతి వర్ధంతి వేడుకలు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF ) సహాయ కార్యదర్శి తుమ్మల లవకుమర్ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ళ శ్రీనివాసులు, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి రవిశంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలనలో భారతీయుల కు జరుగుచున్న అన్యాయాన్ని ఎదిరించి వారి ఆధిపత్యానికి ఎదిరించిన ధీరుడు అని ఆయన త్యాగాన్ని మనం మరచిపోకూడదు అని అన్నారు. నేడు దేశంలో జరుగుచున్న మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి భారతీయులు మరో పోరాటానికి సిద్దం కావాలని అన్నారు. ప్రధానోపాధ్యాయులు సైరాభాను మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహా నాయకులు సుకదేవ్, రాజ్గురు, భగత్ సింగ్ అని అన్నారు. లవకుమార్ మాట్లాడుతూ ఆనాడు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్ అని అతి చిన్న వయసులో ఉరికంబం ఎక్కిన ధైర్యశాలి ఆయన ఆశయాల కోసం మనమందరం పోరాడినప్పుడే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏరియా కార్యదర్శి కిరణ్ కుమార్ సిపిఐ నాయకులు చంద్రయుడు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సైరాబాను, పాఠశాల సిబ్బంది బయ్యరెడ్డి ,రాజ్యలక్ష్మి,, లలిత కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.
Comentarios