20సం సమస్యలకు శాశ్విత పరిష్కారం
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరింత చేరువై ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, అభివృద్ధి పధంలో నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతి, ఉప సర్పంచ్ రాఘవ రెడ్డి అధ్యక్షత భగత్ సింగ్ కాలనీ మూడవ వీధి నుండి జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాచమల్లు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్న ఆయన, ఎక్కడికక్కడ సమస్యలను అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడచిన 127 రోజుల నుండి ఎటువంటి అపశృతి లేకుండా గడప గడప కార్యక్రమం నిర్విరామంగా నిర్విఘ్నంగా చేపడుతూ వస్తున్నామని, అందుకు సహకరించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందుగా కృతజ్ఞతలు తెలియచేసారు. ఇక రురల్ పరిధిలోని రాజుపాలెంలో త్వరలో ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు.
ఇకపోతే ఇక్కడి ప్రధానమైన మూడు సమస్యలు ఉన్నాయని అవి భగత్ సింగ్ కాలనీ ఆరు వీధులకు సంబంధించిన కాలువల నిర్మాణం త్వరలో చేపడతామని, ఆరు వీధుల కాలువనీరు బయటికి వెళ్ళటానికి ఆస్కారం లేనందున, కొర్రపాడు రోడ్డులో పెద్ద కాలువ నిర్మించి ఆరు వీధుల కాలువలు దానికి అనుసంధానం చేస్తామని, ఇందుకుగాను ఎమ్మెల్యే గా తనకున్న అధికారాన్ని ఉపయోగించి కోటి రూపాయల నిధులు కేటాయిస్తున్నానని తెలిపారు. త్వరలోనే టెండర్ ప్రక్రియకు వెళ్లి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
ఇక రెండవ సమస్య మౌలిక వసతి అయిన 33కేవీ లైన్ ఇక్కడి వీధులగుండా ఇళ్ల మధ్యన ఇంటి మీది నుండి వెళ్ళటం వలన జంతువులకు, ప్రజలకు ప్రాణహాని ఉన్నందని, లింగారెడ్డి కొట్టాల దగ్గర నుండి ప్రకాష్ నగర్ వరకు 33కేవీ విద్యుత్ లైన్ విస్తరించి ఉన్నదని, సమస్యను గుర్తించి తాను పలు సందర్భాలలో అధికారులతో అలాగే అసెంబ్లీ నందు కూడా చెర్చించానని, నాడు టీడీపీ ప్రభుత్వంలో పనులు చేయలేకపోయామని. నేడు వైసీపీ ప్రభుత్వంలో గడప గడప కార్యక్రమానికి గాను నూటా యాబై కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిందని, కావున ఈ ప్రాంతంలో 33కేవీ లైన్ మార్పునకు కోటి రూపాయలు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇక మూడవ సమస్య అయిన స్మశాన వాటిక గురించి గత ప్రభుత్వంలో అధికారులను పలుమార్లు అడిగినా పట్టించుకోలేదని, కావున జనాభాకు తగినట్లు అవసరమైన భూమిని ప్రభుత్వం ద్వారా గుర్తించి, ప్రహారి గోడ, రోడ్డు, స్నానాల గదులు ఏర్పాటు చేసి ప్రజలకు స్మశాన వాటిక అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘవ రెడ్డి, కో ఆప్షన్ మాంబేర్ ఖాదర్ బాషా, ఎంపీటీసీ 2 వసుంధర, ఎంపీటీసీ 5 భూసం రవి, వైసీపీ నాయకులు, పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు, భగత్ సింగ్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
Kommentare