శ్రీ వీరభద్రుని ఆలయంలో..
పుష్కరి నిర్మాణం కోసం భూమి పూజ.
---ముందుకొచ్చిన తిరుపతి బ్రాహ్మణ మహిళ సంఘం.
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం పాత చిట్వేలు గ్రామంలో మట్లి రాజుల కాలంలో నిర్మితమై దినదినాభివృద్ధి చెందుతూ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్న... "శ్రీభద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి" ఆలయంలో పుష్కరిణి నిర్మాణం కోసం తిరుపతికి చెందిన బ్రాహ్మణ మహిళ సంఘం ఆధ్వర్యంలో ముందుకు వచ్చి ఈ రోజున భూమి పూజ కార్యక్రమాన్ని తిరుమల దేవస్థాన వేద పండితులచే పెద్ద ఎత్తున నిర్వహించారు.
బ్రాహ్మణ మహిళా సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులైన రోజా , లక్ష్మి లు ఇరువురు మాట్లాడుతూ... ఘన చరిత్ర కలిగిన ఈ దేవస్థానం మూల దేవతల వల్ల మాకు మంచి జరిగిందని; ఫలితంగా శాశ్వతంగా నిలిచే నిర్మాణమైన కోనేరును సుమారు పది లక్షల వ్యయంతో నిర్మించేందుకు ఈ రోజున భూమి పూజను తలపెట్టామని మా బ్రాహ్మణ సంఘ సహకారంతో త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన బ్రాహ్మణ సంఘ సభ్య మహిళలు, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ పూజారులు,మండల పరిధిలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments