రేపటి నుంచి భువనగిరి పల్లె లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భువనగిరి పల్లె లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మూడవ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు పూల హరిప్రసాద్, కావేరి గారి వెంకటరమణ, నామాల రాజశేఖర్, కంబాయిగారి సుబ్బ నరసింహులు, మన్నేరు లక్ష్మీనరసయ్య, కొమ్మూరు సుబ్బ నరసయ్యలు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగవ తేదీ గురువారం శ్రీ నరసింహ జయంతి, అభిషేకము, అర్చన, వెండి కవచధారణ, ఉదయం గీతా పారాయణంతో మధ్యాహ్నం, రాత్రి విశేష అన్నదాన కార్యక్రమం ఉంటుందని, శుక్రవారం అభిషేకము, సహస్రనామార్చన, గరుడసేవ.. శనివారం కళ్యాణ మహోత్సవం నిర్వహించబడునని తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి సమయాలలో విశేష అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు.
Comments