చిట్వేలి లో విజయవంతంగా బైక్ ర్యాలీ.
---పెద్ద ఎత్తున పాల్గొన్న అధికారులు, నాయకులు, ప్రజలు, యువత
---భారత్ మాతాకీ జై అంటూ హోరెత్తిన నినాదాలు.
ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశం ఆదేశాల మేరకు చిట్వేలి మండలంలో ప్రధాన వీధుల్లో మండల అధికారులు, నాయకులు,ప్రజలు, యువత, విద్యార్థులు ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున పాల్గొని భారీగా మన దేశ కీర్తిని దశదిశన చాటుతూ బైక్ ర్యాలీని నిర్వహించారు.
మూడు రోడ్ల కూడలి నుంచి ప్రారంభించి డాక్టర్ వైయస్సార్ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. తదుపరి మానవహారం నిర్వహించి స్వాతంత్ర సమరయోధుల కీర్తిని స్మరిస్తూ " భారత్ మాతాకీ జై" అంటూ నినాదాలు చేస్తూ భావితరాలకు దేశభక్తిని స్ఫూర్తిని నింపుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తదుపరి మండల ఎంఆర్ఓ మురళీకృష్ణ ఎంపీడీవో మోహన్ ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర సాధనలో మన దేశం సాధించిన కీర్తిని, స్వేచ్ఛ వాయువులను ప్రసాదించిన అమర జీవులను స్మరించుకుంటూ త్వరలో జరగనున్న 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధమవుతూ ఈ రోజున ర్యాలీ నిర్వహించడం దానికి ప్రజలందరూ సహకరించడం సంతోషకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో మోహన్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ శేషంరాజు, సీనియర్ అసిస్టెంట్ రామ సుబ్బారెడ్డి, ఎంపీపీ చంద్ర, పి ఈ టి ఉపాధ్యాయులు డేవిడ్, ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్, సచివాలయ సర్వేయర్లు, వీఆర్వోలు, అగ్రికల్చర్ అసిస్టెంట్ లు, ఇంజనీరింగ్ సిబ్బంది,స్థానిక పోలీసు సిబ్బంది,ప్రజలు, యువత స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments