రాష్ట్రం లో ఉపాధ్యాయుల పని వేళల పై డేగ కన్ను పెట్ట నుంది. బయో మెట్రిక్ విధానాన్ని రాబోవు మాసం లో పూర్తి స్థాయి లో అమలు చేయాలని నిర్ణయించారు. నిన్నటి ఉద్యమాన్ని చూసి ఉలిక్కి పడ్డ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది అని అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. దీని ప్రకారం రాబోవు నెల నుండి ఉపాధ్యాయుల బయో మెట్రిక్ హజరు కొరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిని గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విజయనగరం స్వంత పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి దగ్గర ఒత్తిడి చేసినట్లు సమాచారం. చైనా కంపెనీ కి చెందిన HUAI సంస్థ యొక్క డివైజులను భారీ గా కొనుగోలు చేసి దానిని CFMS కు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా రాష్ట్రం లోని ఉపాధ్యాయుల పని వేళలను పర్యవేక్షణ చేస్తారు. ఉదయం 9 : 15 తరువాత హజరైన ఉపాధ్యాయులను Late గా పరిగణిస్తారు. ఇటువంటి 3 Late లకు 1 పూర్తి CL గా నిర్ణయిస్తారు. 9:30 తరువాత హజరైన ప్రతి సారి ఒక HALF DAY CL గా పరిగణిస్తారు.
top of page
bottom of page
Comments