ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు నియోజకవర్గ బిజెపి కార్యాలయంలో ఆ పార్టీ ఇంచార్జి గొర్రె శ్రీనివాసులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఒకవైపు టిడిపి చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్, మరో వైపు బిజెపి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పోడ్చటానికి ప్రయత్నిస్తుంటే, ప్రొద్దుటూరులో మాత్రం తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు మరో దారి వెతుక్కుని, ఓ చీకటి ఒప్పందం ప్రకారం అయితే టిడిపి లేదా వైసిపి పార్టీలు ప్రొద్దుటూరులో పాగావేయాలని, బిజెపిని పరజలలోకి రానివ్వకుండా అనగతొక్కి బలోపేతం కాకుండా చేయాలని చీకటి ఒప్పందానికి వచ్చారని, కేసుల కోసం స్థానిక వైసీపీ ఎమ్మెల్యేతో ప్రొద్దుటూరు టిడిపి నాయకుడు ఒకరు ఒప్పందం కుదుర్చుకొని జైలుకు వెళ్లి వచ్చాడని ఆయన ఆరోపణలు గుప్పించారు పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ అటు వైసీపీని ఇటు టిడిపి పై ఆరోపణలు గుప్పించారు, ఇలాంటి చీకటి ఒప్పందాల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఇందుకు ఉదాహరణగా నిన్న అనగా శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రాజుపాలెం మండలం టంగుటూరు గ్రామంలో టిడిపి వైసిపి నాయకులు ఇరువురు కలిసి బిజెపి ఫ్లెక్సీని తొలగించడానికి అడుగగా, రాజుపాలెం మండల బిజెపి నాయకులు ఫ్లెక్సీ తొలగించడానికి అంగీకరించకపోవడంతో టిడిపి వైసిపి నాయకులు ఇరువురు ఒక వర్గంగా ఏర్పడి బిజెపి నాయకులు కార్యకర్తలపై దూషణలకు దిగారని, ప్రొద్దుటూరులో టిడిపి పార్టీ క్యాడర్ దిగజారిపోయిందని, ఇకనైనా ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపక్షాలకు కాకున్నా ప్రజల కోసం ఇకనైనా మారాలని ఆయన హితువు పలికారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, రాజుపాలెం మండలాధ్యక్షుడు జి రామసుబ్బయ్య, బిజెపి నాయకులు కే వెంకటసుబ్బన్న, శరత్ బాబు, కిసాన్ మోర్చా మండలాధ్యక్షుడు ఎం. సుబ్బయ్య, తాటి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
Comments