కాలువపై అక్రమ నిర్మాణాలు తొలగించాలి -
గొర్రె శ్రీనివాసులు
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం పంచాయతీలో మైలవరం కాలువను ఆక్రమిస్తు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవలెనని ప్రొద్దుటూరు నియోజకవర్గ బిజెపి కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు మంగళవారం ఉదయం ఎమ్మార్వో నజీర్ అహ్మద్ కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీలోని పొట్టిపాడు బైపాస్ రోడ్డు నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్నటువంటి మైలవరం కాలువపై ఆయా ప్రదేశాలలో ఉండే వైయస్సార్సీపి నాయకుల అధికారం అడ్డుపెట్టుకొని కాలువను పూడ్చివేసి కాలువలు పైన అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. అట్టి నిర్మాణాలకు గాను పంచాయితీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అవినీతికి పాల్పడి దగ్గర ఉండి అక్రమ నిర్మాణాలకు ఆమోదం తెలుపుచున్నారని ఆరోపణ చేశారు. గతంలో మైలవరం కాలువకు ఇరువైపులా కాల్వ పూడికలను తీసివేయుటకు అలాగే రాకపోకలకు దారి ఉండేదని, కానీ ఇప్పుడు ఇల్లు నిర్మాణాలు చేపట్టి కాలువను, బండ్ల రస్తాను కూడా కూల్చివేస్తూ కాలువలో నిర్మాణాలు చేపడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోకపోవడంపై పలు రకాల అనుమానాలకు తావిస్తోంది ఆయన అభిప్రాయపడ్డారు. పై చర్యల వల్ల నీరు నిలువ జరిగి, ప్రజలకు అంటు వ్యాధులు, విష జ్వరాలు సోకుతున్నాయని తహక్షణమే అట్టి నిర్మాణాలు తొలగించాలన్నారు.
ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే అక్రమ నిర్మాణాలను తొలగించి, కాలువ పూడికను తీసి, మురికి నీరు, వ్యర్థ నిలువ లేకుండా చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments