బిజెపితో జనసేన దోస్తీ
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
గురువారం ఉదయం ప్రొద్దుటూరు బిజెపి కార్యాలయం నందు ఆ పార్టీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు జిలాన్ భాష సంయుక్తంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిలాని భాష మాట్లాడుతూ, ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు జనసేన పార్టీ అధిష్టానం ఇన్చార్జిని లేదా కన్వీనర్ ను నియమించలేదని, కొందరు వ్యక్తులు తాము జనసేన పార్టీ పట్టణ ఇంచర్జ్ అని చెప్పుకుంటూ చలామణి అవుతున్నారని, ఇది తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొని పోతామని, రానున్న ఎన్నికల్లో బిజెపి జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తాయని, అధిష్టాన నిర్ణయం ప్రకారం ముందుకు వెళతామని జిలాన్ భాష తెలిపారు.
అనంతరం గొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 267 పోలింగ్ బూతులు ఉండగా, దాదాపు 20 బూతులకు కన్వీనర్లను ఏర్పాటు చేశామని, వీటిని శక్తి గ్రూపులుగా విభజించి రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయనున్నట్లు, ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోడీ నిర్వహిస్తున్న మన్ కి బాత్ కార్యక్రమం ద్వారా కార్యాచరణ చేసుకొని తగు విధముగా శక్తి గ్రూపులను ముందుకు తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. 2024న జరగబోవు ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు వెళతామని ఆయన తెలిపారు.
Comments