బిజెపి మండల బూత్ కమిటీ సమావేశం
నందలూరు మండలంలోని కుంపిణీపురం గ్రామంలో నందలూరు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఆంధ్ర శివారెడ్డి అధ్యక్షతన శనివారం సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ రామ్ జగదీశ్ స్వామి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనందగజపతి రాజు విచ్చేసినారు సమావేశంలో మండలంలోని 35 పోలింగ్ బూతులకు అధ్యక్షులను నియమించడమైనది నవంబర్ నెల రెండవ తారీఖున ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి విచ్చేస్తున్నారు ఈ సమావేశంలో తప్పనిసరిగా బూతు అధ్యక్షులు మరియు శక్తి కేంద్ర ప్రముఖులు ప్రధానంగా పాల్గొనాలని కన్వీనర్ తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు హరి ప్రసాద్ గారు జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సురేష్ రాజుగారు సీనియర్ నాయకులు విట్టల్ స్వామి ఆదినారాయణ యువ మోర్ ఛా అధ్యక్షులు చుక్క శ్రీనివాసులు కుంపినిపూరం బూత్ అధ్యక్షుడు భద్రి స్వామి పాల్గొన్నారు.
Commentaires