బిజెపి ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఆదివారం ఉదయం స్థానిక గోపికృష్ణ స్కూల్ నందు బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభ్యత్వ నమోదు అవగాహన సమావేశాన్ని సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన కడప జిల్లా బిజెపి అధ్యక్షులు వంగల శశిభూషణ్. కార్యక్రమానికి జిల్లా జోనల్ ఇన్చార్జ్ బిట్టా శివ నారాయణ, బద్వేలు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన బొజ్జ రోషన్న, ప్రొద్దుటూరు టౌన్ ప్రెసిడెంట్ నాగేంద్ర, సీనియర్ బిజెపి నాయకులు కోనేటి కృష్ణ ప్రదీప్ తదితరులు పాల్గొనగా సభ్యత్వ నమోదు అభియాన్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు శశిభూషణ్ మాట్లాడుతూ, ప్రతి మూడు సంవత్సరములకు ఒకసారి సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమం తమ పార్టీ చేపడుతుందని, సభ్యత నమోదు కార్యక్రమాలు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం కానున్నట్లు, ఇందులో భాగంగా గతంలో కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న లక్ష అరవై వేల సభ్యత్వాలను పునరుద్ధరించి ఈ 2024 సంవత్సరంలో రెండు లక్షల సభ్యత్వ నమోదు తమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రతి బూత్ నందు 200 సభ్యత్వాలు లక్ష్యంగా నాయకులకు క్రియాశీల కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసామని, రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకించి కడప జిల్లాకు గత ఎన్నికలలో కూటమి అభ్యర్థుల ప్రకటన యందు రెండు ఎమ్మెల్యే టికెట్లు దక్కాయని గుర్తు చేస్తూ, మిత్రపక్షాలు మినహా మిగతా పార్టీల నాయకులు కార్యకర్తలు బిజెపి పార్టీ గూటికి వస్తామంటే ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కార్యకర్తల బలం ఉన్న పార్టీ బిజెపి అని, నాడు రెండు లోక్ సభ సీట్లతో మొదలుకొని నేడు అంచలంచెలుగా వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రి పదవిని దక్కించుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక బిజెపి పార్టీనేనని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో రాజకీయ పార్టీ బలం ప్రపంచానికి తెలియాలి అంటే ఆ పార్టీకి ప్రజాప్రతినిధులు ఉండాలి అని ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా తమ పార్టీకి 18 కోట్ల సభ్యత్వాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న సీనియర్ బిజెపి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments