top of page
Writer's pictureEDITOR

2 వేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవాలి - భాజపా ఎంపీ డిమాండ్

2 వేల రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవాలి భాజపా ఎంపీ డిమాండ్

దిల్లీ, దేశంలో 2 వేల రూపాయల నోట్లను దశలవారీగా వెనక్కి తీసుకోవాలని భాజపా ఎంపీ రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. వాటిని డిపాజిట్‌ చేసేందుకు ప్రజలకు రెండేళ్ల సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం రాజ్యసభ శూన్య గంటలో ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ ఈ అంశాన్ని లేవనెత్తారు.


దేశంలో అన్ని ఏటీఎంలలో 2 వేల రూపాయల నోటు కనుమరుగైపోయందని, త్వరలో ఈ నోట్లనూ రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతోందని సుశీల్‌ కుమార్‌ మోదీ అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. 2 వేల రూపాయల నోట్ల ముద్రణను సైతం ఆర్‌బీఐ నిలిపివేసిందన్నారు. పెద్ద నోటైన వెయ్యి రూపాయలను రద్దు చేసి.. రూ.2 వేల నోటును ఉంచడంలో అర్థం లేదని పేర్కొన్నారు. 2 వేల రూపాయల నోట్లు బ్లాక్‌ మనీకి కేంద్రంగా మారాయని చెప్పారు. డ్రగ్స్‌, మనీలాండరింగ్‌ వంటి అక్రమ కార్యకలాపాలకు నెలవుగా మారాయని పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం దశలవారీగా ఈ నోటును వెనక్కి తీసుకోవాలని కోరారు. నోట్లను మార్పిడి చేసుకోవడానికి ప్రజలకు రెండేళ్ల సమయం ఇవ్వాలని కోరారు.


శూన్య గంటలో మరికొందరు ఎంపీలు వేర్వేరు అంశాలను లేవనెత్తారు. జీఎస్టీ పరిహారాహన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని సీపీఎం సభ్యుడు ఎల్మారమ్‌ కరీన్‌ డిమాండ్‌ చేశారు. తక్షణ లోన్‌ యాప్‌లు వినియోగదారులను బెదిరించడమే కాకుండా వ్యక్తుల వ్యక్తిగత డేటా చౌర్యానికి కూడా పాల్పడుతున్నాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ యాప్‌లపై తక్షణమే ఉక్కు పాదం మోపాలని డిమాండ్‌చేశారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10 లక్షల పోస్టులను భర్తీ చేయాలని సీపీఎం ఎంపీ శివదాసన్‌ పేర్కొన్నారు. తేనీటిని జాతీయ పానీయంగా ప్రకటించాలని భాజపా ఎంపీ పవిత్ర మార్ఘరిటా శూన్య గంటలో ప్రస్తావించారు.

55 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page