కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సోకులా..?
బిజెపి నియోజకవర్గ కో కన్వీనర్
రాజంపేట బి జె పి నియోజక వర్గ కో కన్వీనర్ అరిగే రాంబాబు సోమవారం ఎంపిడిఓ సౌభాగ్యం ను ఆమె కార్యాలయం కలిసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభవృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు అని కానీ ఎక్కడ ప్రధాన మంత్రి మోడీ ఫోటో కనపడడం లేదు అని ఆమెను ప్రశ్నించారు. ఉచిత బియ్యం అనేవి కేంద్రం నుండి విడుదల చేస్తున్న పేద, సామాన్య ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచిత బియ్యం సరఫరా చేస్తోంది. అదేవిధంగా పేదలకు రేషన్ వాహనాల ద్వారా నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తోంది.
కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రేషన్ వాహనాలపై కేవలం ముఖ్యమంత్రి YS జగన్మోహన రెడ్డి ఫొటోను మాత్రమే ముద్రించి ప్రజల్లో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ప్రజలకు తెలియనివ్వడం లేదు. అందుకు నిరసనగా ఎంపిడిఓని కలిసి ప్రతీ రేషన్ వాహనంపై విధిగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫొటో అతికించాలి అని డిమాండ్ చేయడం జరిగింది అని ఆయన అన్నారు అదేవిధంగా మండలంలోని ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం ఉంచాలని ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
ఒకవేళ అలా ప్రధాని ఫొటో వేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వయంగా ప్రతీ రేషన్ వాహనంపై ప్రధాని ఫొటోలు అతికించే కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. ఎంపీడీఓ సానుకూలంగా స్పందించారు. అందుకు బీజేపీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతురాజు మస్తానయ్య బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శి విఠలాచార్య స్వామి , బీజేపీ సీనియర్ నాయకులు శివారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు చుక్కా శ్రీనివాసులు, మండల యువమోర్చ అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments