వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు కు బీజేపీ జాతీయ సెక్రటరీ సత్య కుమార్ నేడు విచ్చేసిన సందర్భంగా ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు, నిన్న కడపలో జరిగిన సమావేశంలో పాల్గొన్న సత్య కుమార్ నేడు ప్రొద్దుటూరు చేరుకుకున్నారు.
తాజాగా అయిదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తరుపున 153 నియోజవర్గాలకు కో-ఇంచార్జ్ గా సత్య కుమార్ ను నియమిస్తూ కేంద్ర బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయగా, క్రియాశీలకంగా వ్యవహరించిన సత్య కుమార్ 135 స్థానాలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. ఈ సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు విచ్చేసిన సత్య కుమార్ కు కొత్తపల్లె బైపాస్ నుండి పి.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు, బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలకగా సత్య కుమార్ ప్రజలకు అభివాదం చేశారు.
అనంతరం పి.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్ నందు సభ ఏర్పాటు చేశారు, సభను ఉద్దేశించి రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని విధి విధానాలను తప్పుబట్టారు, అనంతరం సత్య కుమార్ మాట్లాడుతూ ముందుగా ప్రొద్దుటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేసారు, తాను పుట్టి పెరిగింది ప్రొద్దుటూరులోనే అని తన విద్యాభ్యసం చిన్ననాటి అనుభూతులను పంచుకున్నారు. అనంతరం కేంద్రలో బీజేపీ పాలనపై తాము సాధించిన విజయాలను ప్రజలకు గుర్తు చేశారు, రాష్ట్రంలో అభివృద్ధి పడక వేసిందని, ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కుంటు పడ్డాయని విమర్శించారు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు సమకూర్చుస్తున్న ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా సద్వినియోగ దిశగా అడుగులు పడలేదని, ముప్పై లక్షల గృహాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరిస్తే కనీసం పేదలకు ఇండ్లు నిర్మించలేదని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా నేడు బీజేపీ అవతరించిందని పద్దెనిమిది కోట్ల భారతీయులు బీజేపీ సభ్యత్వాలు కలిగి ఉన్నారని, వివిధ రాష్ట్రాలలో మొత్తం 1500 మంది MLA ల బలం బీజేపీకి ఉందని, పదిహేడు రాష్ట్రాలలో బీజేపీ పరిపాలన సాగిస్తోందని, తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో తమ పార్టీ బలం పెరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ సెక్రటరీ సత్య కుమార్, స్టేట్ జనరల్ సెక్రటరీ విష్ణు వర్ధన్ రెడ్డి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆది నారాయణ రెడ్డి, చంద్ర మౌళి, స్టేట్ సెక్రటరీ చిరంజీవి రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు ఎల్లా రెడ్డి, కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్ గొర్రె శ్రీనివాసులు, జిల్లా జనరల్ సెక్రటరీ భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి, BJYM స్టేట్ ప్రెసిడెంట్ సురేంద్ర మోహన్, BJYM రాష్ట్ర జనరల్ సెక్రటరీ వంశి, BJYM జిల్లా ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్, మహిళా మోర్చా రాయలసీమ జోనల్ ఇంచార్జి శ్రీమతి జయ లక్ష్మి, రాష్ట్ర నాయకులు సోమాల రమేష్ బాబు, ఒంటేరు భాస్కర్ రెడ్డి, 11వ వార్డు బీజేపీ ఇంచార్జ్ గొర్రె కృష్ణ, క్రియాశీలక కార్యకర్త కొర్రపాటి లక్ష్మీ నారాయణ, ఆదినారాయణ రెడ్డి అభిమానులు, గొర్రె శ్రీనివాసులు అనుచరవర్గం తదితరులు పాల్గొన్నారు.
Comments