కడప జిల్లా, ప్రొద్దుటూరు లోని బీజేపీ కార్యాలయంలో కడప జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ ద్వారా కొత్తపల్లి పంచాయతి కి 1.2 కోట్ల విడుదల చేసారు అని, అమృత నగర్ లో 50 కోట్ల ఖర్చుతో రోడ్డు రూపాయల నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధుల వలనే సాధ్యం అయ్యిందన్నారు. ప్రొద్దుటూరును జిల్లాగా అడగటానికి MLA తనకు అర్హత లేదు అంటున్నారు మరి రాయచోటి MLA తో జిల్లాల ప్రస్తావన తీసుకురాను అని లోపాయకారి ఒప్పందం చేసుకున్నారా అని సూటిగా ప్రశ్నించారు. జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపద్యంలో ప్రొద్దుటూరు జిల్లాగా ప్రకటించే అన్ని అర్హతలు ఉన్న, MLA ఈ విషయం ప్రస్తావించకపోగా ఇది తన పరిధిలో లేదు ఈ అంశం అనటం సబబుకాదు అన్నారు.
అన్ని జిల్లాలలో వైసీపీ MLA లు జిల్లాల పునర్విభజన గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రొద్దుటూరు MLA మౌనం పాటిస్తున్నారన్నారు. మెడికల్ కాలేజ్ విషయంలో MLA ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, 2019-20 కి గాను 22 మెడికల్ కాలేజీలు ప్రకటన విడుదల చేశారని అప్పుడు పులివెందుల పేరు అందులో లేదు అన్నారు, పులివెందుల లో ఉన్నది 80 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమేనని కానీ ప్రొద్దుటూరులో 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న మెడికల్ కాలేజ్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు, ప్రొద్దుటూరును ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి అని త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు బొరెడ్డి సుధాకర్ రెడ్డి, రూరల్ ఇంచార్జ్ నరసింహ ప్రకాష్, ఎస్. సి సెల్ నాయకుడు డి. కుమార్ రాజా, రాజుపాళెం మండల అధ్యక్షుడు రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments