వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు మునిసిపల్ పరిధిలో నీటి ఎద్దడి గల వార్డులలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం చేపట్టారు, వై.ఎస్.ఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు, పట్టణ బీజేపీ ఇంచార్జి గొర్రె శ్రీనివాసులు. పట్టణంలోని 35, 38, 39 వార్డులలో ఇంటింటికి తిరిగి త్రాగునీరు, విద్యుత్ చార్జీలు, చెత్త పన్నులపై అక్కడి వార్డులోని ప్రజల మనోభావనాలు బీజేపీ నాయకులు అడిగి తెలుసుకున్నారు. పై వార్డులోని ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ విధి విధానాలను తప్పుబట్టారు. గత కొన్ని దశాబ్దాలుగా తాము ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నామని, ఏ ప్రభుత్వ హయాంలో కూడా చెత్త పన్నులు విధించలేదని, విద్యుత్ చార్జీలు అమాంతం పెంచేశారని, వార్డులలో రెండురోజులు ఒకసారి కూడా మంచి నీరు సరిగా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరికాదని, కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో ఎన్నో పధకాలు అమలవుతున్నా వాటిని ప్రజలకు తెలియచేయకుండా, పథకాలన్నీ వైసీపీ ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రచారాలు చేసుకుంటున్నారని, ప్రొద్దుటూరులో నేటి ఎద్దడి ఎక్కువగా ఉందని, పలు వార్డులలో కనీసం రెండు రోజులకు ఒకసారి కూడా మంచినీరు రావటం లేదని ప్రజల దాహార్తిని తీర్చాల్సిన నాయకులు ఇవేవి తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, అప్రకటిత కరెంటు కోతలు, పెంచిన విద్యుత్ చార్జీల వలన ప్రజలలో అసహనం మొదలయిందని, చెత్త పన్నులు వసూలు చేయటం సరికాదని, ఇకనైనా ప్రభుత్వం తక్షణమే ఆలోచించి ప్రొద్దుటూరు ప్రజల దాహార్తిని తీర్చాలని, పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, చెత్త పన్ను వసూలు చేయటం ఆపాలని, లేని పక్షంలో ప్రజలు మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కడప జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు, ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షులు పి. సుబ్రహ్మణ్యం, మండలాధ్యక్షులు బోరెడ్డి సుధాకర్ రెడ్డి, సీనియర్ బీజేపీ నాయకులు పల్లె రఘురామ్ రెడ్డి, Sc మోర్చా పట్టణధ్యక్షులు కుమార్ రాజా, మాజీ పట్టణధ్యక్షులు వి. నరేంద్ర, ఓ.బి.సి జిల్లా ప్రధాన కార్యదర్శి యన్. నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి పి. అంజి, 11వ వార్డు ఇంచార్జీ గొర్రె కృష్ణ, 38 వార్డ్ ఇంచార్జి వద్ది సుబ్బయ్య, రాజుపాలెం మండల నాయకుడు రామసుబ్బయ్య, బీజేపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Comments