జర్నలిస్టులకు వృత్తి పన్ను రాష్ట్ర ప్రభుత్వం విధించడంపై బిజెపి అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రంరాజు సురేష్ రాజు మండి పడ్డారు
ఎటువంటి జీతాలు లేని జర్నలిస్టులకు వృత్తి పన్ను విధించే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వంపై ఇప్పటివరకు జర్నలిస్టులకు జీతభత్యాలు లేకపోగా రాష్ట్ర ప్రభుత్వం వారిపై వృత్తి పన్ను విధించడం హాస్యాస్పదంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రంరాజు సురేష్ రాజు అన్నారు.
ప్రభుత్వానికి పలుకుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు గాఢ నిద్రలో ఉన్నారని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడవలసింది పోయి వృత్తి పన్ను విధించడంపై బిజెపి తీవ్రంగా ఖండిస్తుంది అని, కష్టపడే ప్రతి జర్నలిస్టు ఎటువంటి గౌరవ వేతనం లేకపోయినా.. వార్తలే పరమావధిగా జీవిస్తున్నారు.. అటువంటి జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఏ సహాయం అందకపోవడం చాలా బాధాకరమైన విషయం అని ప్రభుత్వం వెంటనే ఈ చర్యలను మానుకోవాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శియర్రంరాజు సురేష్ రాజు అన్నారు.
Comments