top of page
Writer's picturePRASANNA ANDHRA

రాష్ట్ర అభివృద్ధి బిజెపితోనే సాధ్యం - పురంధేశ్వరి

రాష్ట్ర అభివృద్ధి బిజెపితోనే సాధ్యం


ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించిన పురందేశ్వరి


రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి కృషి చేస్తాం - పురంధేశ్వరి


వారి పరిశ్రమలకే అనుమతులన్నీ మంజూరు - మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి


కడప జిల్లాలో శాంతిభద్రతలు కరువయ్యాయి - ఎంపీ రమేష్ నాయుడు

రాయలసీమ బిజెపి జోనల్ సమావేశం నేడు కడప జిల్లా ప్రొద్దుటూరులో బిజెపి నాయకులు నిర్వహించారు ఈ సమావేశానికి బిజెపి ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర రాయలసీమ బిజెపి ముఖ్య నేతలు హాజరయ్యారు.


ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ, పొత్తుల విషయం ఢిల్లీ పెద్దలు చూసుకుంటారని తాము రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ నూతన బిజెపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. రాయలసీమ దత్త పుత్రుడిగా తమ తండ్రి ఎన్టీఆర్ ప్రకటించుకున్నాడని, అదే నేల మీద తాను బీజేపీ అధ్యక్షురాలిగా తొలిసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్రం ఏ విధమైన సహకారం ఇవ్వాలో ఆ సహకారాన్ని మాత్రమే అందిస్తుంది తప్ప బీజేపీ వైసీపీ మధ్య ఎలాంటి బంధాలు లేవన్నారు. వైసీపీ కి సహకరిస్తూ ఉంటే రాష్ట్రంలో ఎందుకు పోరాటం చేస్తామని ప్రశ్నించారు.


విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం నిర్ణయం మేరకే జరుగుతూ ఉందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్రం స్పష్టంగా ఉందని ఆమె పేర్కొన్నారు. రాయలసీమ అభవృద్ధి, సాగు నీటి విషయంలో కర్నూలు రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మరోమారు స్పష్టం చేశారు. రాయలసీమ ఉద్యమ నాయకుడు బైరెడ్డి రాజ శేఖర్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు నడ్డా పై చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా ఆయన వద్ద ఏమైనా సమాచారం ఉంటే నేరుగా నడ్డా వద్దకు వెళ్లొచ్చినన్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీ లో ఉన్నారా అన్న ప్రశ్నకు ఆయన కుమర్తె శబరి బీజేపీ లో ఉన్నారని పురంధేశ్వరి తెలిపారు.


మాజీ మంత్రి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ...


రాయలసీమ లో 12 సిమెంటు కర్మాగారాలు ఉన్నాయని అందులో వైఎస్ భారతి రెడ్డి సంబంధించి భారతి సిమెంట్స్ కూడా ఒకటి ఉందని, అయితే ఆమె పరిశ్రమకు మాత్రం అనుమతులన్నీ టైం టు టైం సజావుగా వస్తుంటాయని.. మిగిలిన సిమెంట్ కర్మాగారాలకు మాత్రం ఏదో ఒక సాగు చూపించి అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి తప్ప ఎలాంటి అభివృద్ధి లేదంటూ ఆదినారాయణ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.


రాజ్యసభ ఎంపీ రమేష్ నాయుడు మాట్లాడుతూ...


కేంద్రం 65% సబ్సిడీ కింద రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తున్న రాష్ట్ర వాటా 15% కూడా ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం లేదని అన్నారు. రాయలసీమలో మరి ముఖ్యంగా కడప జిల్లాలో శాంతిభద్రతలు కరువయ్యాయని, రాయలసీమ జిల్లాలలో ఏ ఎమ్మెల్యే చూసినా క్రికెట్ బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు అంటూ ఎంపీ రమేష్ నాయుడు విమర్శించారు.

91 views0 comments

Commentaires

Noté 0 étoile sur 5.
Pas encore de note

Ajouter une note
bottom of page