రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని స్వామి రిలాక్స్ ప్యారడైజ్ నందు భారతీయ జనతాపార్టీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్ అధ్యక్షతన, భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా శ్రీకాళహస్తి పట్టణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి "శ్రీ, "కోలా ఆనంద్ కుమార్" భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమా పాల్గొనడం జరిగింది, కోలా ఆనంద్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోక పోగ, సామాన్య మధ్యతరగతి ప్రజలపై పన్నుల రూపంలో పెను భారం మోపుతూ పైశాచిక ఆనందం పొందుతూ ఉండడం చాలా దారుణం, ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎవరైనా నోరు విప్పితే కక్షసాధింపు ధోరణి లో దౌర్జన్యాలు చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు, పేద ప్రజలపై ఇంటి పన్ను, చెత్త పన్ను, విద్యుత్ చార్జీల పన్ను,అదేవిధముగా వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఏదో ఒక సాకుతో పెంక్షన్ తొలగించడం చాలా బాధాకరం, రాబోవు రోజుల్లో ఈ వైఎస్.ఆర్. సిపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి తరుణం ఏర్పడుతుంది అని తెలియజేయడం జరిగింది, శ్రీకాళహస్తీశ్వరాలయంలో దళారీ వ్యవస్థ నిలయ తాండవం గా మారింది అని చెప్పడానికి అతిశయోక్తి కాదు, అవినీతి అక్రమాలకు నిలయం తాండవం గా మారింది, అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూస్తూ ఉండటం చాలా దారుణం, అడుగడుగునా అవినీతి పేచ్చు మీరి పోయింది, అదేవిధంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం కొనసాగించాలని దిశా, నిర్దేశం ఇవ్వడం జరిగింది, పై ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్, సీనియర్ నాయకులు చిలక రంగయ్య,శైలజ, సొట్ట సుకుమార్, గరికపాటి రమేష్ బాబు, కన్నా వెంకటేశ్వర్లు,చెంగల్ రాయల్ రెడ్డి, గోపాల్, వీరస్వామి, ప్రజ్ఞశ్రీ, ఉమా సింగ్, పద్మజా వాణి, శివమ్మ ,ఇమ్మడిశెట్టి మోహన్, వాసు యాదవ్,వెంకటేష్ ఆచారి,అయ్యప్ప గౌడ్,బాల, హరి,సాయి,భారత్ నాయుడు, రవి,ఖాదర్,మరియు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు పాతాధిపతులు,యావన్మంది పాల్గొనడము జరిగింది.
top of page
bottom of page
Commentaires