అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా అనర్హుడు - గొర్రె శ్రీనివాసులు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
హైదరాబాద్ లోక్ సభ స్థానం నుండి ఎంఐఎం పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన అసదుద్దీన్ ఓవైసీ 25వ తేదీ జూన్ 2024న, 18వ లోక్ సభ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో, తన ప్రమాణ స్వీకార అనంతరం లోక్ సభ సాక్షిగా 'జై పాలస్తినా' అనే నినాదాలు చేయటం భారత దేశ ప్రజల మనోభావాలు, స్వేచ్ఛాయుత వాతావరణానికి, మతసామరస్యానికి భంగం కలిగించటమేనని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి ప్రొద్దుటూరు కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ, పార్లమెంటు సభ్యులందరూ ఆర్టికల్ 99 ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారని, ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన అసదుద్దీన్ ఓవైసీ 25వ తేదీ నాడు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 'జై పాలస్తిన' అనే నినాదాలు చేయటం ప్రక్కదేశాలైన పాలస్తినాను భుజాన ఎత్తుకోవటమేనని, ఇజ్రాయిల్ - పాలస్తిన దేశాల మధ్య యుద్ధానికి భారతదేశంలోని శాంతి భద్రతల దృష్ట్యా ఇక్కడి ప్రభుత్వం ఇరు దేశాలలో ఏ ఒక్కరికి కూడా సంఘీభావం తెలుపలేదని, అయితే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు దేశంలో పెను దుమారం లేపటమే కాక శాంతి భద్రతల దృష్ట్యా తాము ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పై ఆర్టికల్ 102 (1) (d) ప్రకారం పరాయి దేశాన్ని భారతీయుడు స్లాగించటం, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన నేపథ్యంలో అతని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంట్ డెసిప్లైన్ యాక్షన్ కమిటీ అలాగే పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ లను లేఖ ద్వారా కోరుతున్నట్లు తెలిపారు. నేషనల్ లీగల్ అథారిటీ దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు.
Opmerkingen