వచ్చే ఎన్నికల్లో భాజపా, తెదేపా, జనసేన మధ్య పొత్తు : ఆదినారాయణరెడ్డి
ఏపీలో జరిగే ఎన్నికల్లో భాజపా, తెదేపా, జనసేన మధ్య పొత్తు ఉంటుందని భాజపా నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. పొత్తు దిశగానే చర్చలు జరుగుతున్నాయని చెప్పారు..
రాష్ట్రంలో వైకాపా దుర్మార్గపు పాలనను అంతమొందించడమే లక్ష్యమని.. 3 పార్టీలు కలుస్తాయని భాజపా కేంద్ర నాయకత్వం కూడా సంకేతాలు ఇచ్చిందని తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రి నారాయణ స్వామి కూడా పొత్తులపై స్పష్టతిచ్చారని చెప్పారు. కేంద్రం సంకేతాలు లేకుంటే తానెందుకు ప్రస్తావిస్తానని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌కు కేంద్రం నుంచి ఎలాంటి అండదండలేవని.. సీబీఐ కేసుల్లో కేంద్రం అండగా ఉందనేది అపొహ మాత్రమే అని ఆదినారాయణ రెడ్డి చెప్పారు..
Kommentare