కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలకు చెందిన వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు సోమవారం ఉదయం స్పందన కార్యక్రమంలో భాగంగా, కడప కలెక్టరేట్ ఆఫీసు నందు డి.అర్.ఓ గంగాధర గౌడ్ ని కలిసి ప్రొద్దుటూరు పట్టణం నందు ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువగా ఉండడంతో పాటు కడప తర్వాత వ్యాపార పరంగా వైద్య పరంగా ఎంతో పేరుగాంచినదని, ఇక్కడ వైద్యులు రోగులకు అవసరమైన సమయంలో రక్తం కొరకు సూచించడం జరుగుతున్నదని, ప్రస్తుతం ప్రొద్దుటూరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు మరొకటి ఉన్నట్లు, జనాభా రీత్యా మరొక రక్తనిధి కేంద్రము ఏర్పాటు చేయాలని డి అర్.ఓ. గంగాధర్ గౌడ్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది.
ప్రొద్దుటూరు పట్టణంలో నూతన రక్తని ఏర్పాటు కొరకు పట్టణానికి చెందిన ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ, స్టార్ ఫౌండేషన్, మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్, వికసిత పౌండేషన్, కీర్తన సేవా సమితి, స్నేహ సేవా సమితి, మైదుకూరు పట్టణానికి చెందిన అమ్మా సేవా సంస్థ, నేస్తం సేవా సంస్థ, ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ, ఖాజీపేట కు చెందిన మీకోసం సేవా సంస్థ, సహస్ర ఫౌండేషన్, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం ట్రస్ట్, ఎద్దుల పెద్ద శేషమ్మ వృద్ధాశ్రమం వారు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యకరమములో ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ,స్టార్ ఫౌండేషన్ అధ్యక్షుడు సిరాజుద్దిన్, మైదుకూరు పట్టణానికి చెందిన అమ్మా సేవా సంస్థ నిర్వాహకులు శంకర్, నేస్తం సేవా సంస్థ అధ్యక్షుడు కొండారెడ్డి, ఖాజీపేట కు చెందిన మీకోసం సేవా సంస్థ నిర్వాహకులు విష్ణువర్ధన్, తిప్పలూరు గ్రామానికి చెందిన ఎద్దుల పెద్ద శేషమ్మ వృద్ధాశ్రమ నిర్వాహకులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments