చిట్వేలి లో రక్తదాన శిబిరానికి విశేష స్పందన.
--ఉత్సాహంగా పాల్గొన్న యువత - మేము సైతం అన్న మహిళలు.
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం లో శుక్రవారం.. చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ సహకారంతో చిట్వేలి ఫిట్నెస్ జిమ్ మరియు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. 46 మంది పురుషులు,6 మంది మహిళలు మొత్తం 52 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఫిట్నెస్ జిమ్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని,ఇలా విశేష రోజుల్లో సామాజిక కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.గత 45 రోజులలో చిట్వేలి మండలంలో ఇది 3 వ రక్తదాన శిబిరమని,మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్న దాతలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ,రక్తదాతల నిలయం మా చిట్వేలి అని సిహెచ్ఎస్ బాధ్యుడు గాడి ఇంతియాజ్ అన్నారు.
ఈ రక్తదాన శిబిరంలో ఫిట్నెస్ జిమ్ యజమాని బాలే నాగేశ్వర , ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ చిట్వేలు శాఖ మేనేజర్ సి మల్లికార్జున ,చిట్వేలి ఉపసర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి, బసిరెడ్డి రమణారెడ్డి, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సిహెచ్ఎస్ సభ్యులు కందుల నరసింహ నాయుడు,కాకర్ల కోటేశ్వరరావు, గాల శివారెడ్డి, ఫిట్నెస్ జిమ్ వ్యాయామకారులు ,షేక్ ఇంతియాజ్ ,రాజు, ప్రశాంత్ , తేజ, మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.రక్తాన్ని స్వీకరించిన నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు మధుసూదన్ రావు మరియు సిబ్బంది కార్యక్రమ నిర్వాహకులను అభినందిస్తూ శాలవాతో సత్కరించారు.
Comments