వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ఉన్నత విద్యను అభ్యసించి యువత ఉన్నత శిఖరాలను అధిరోహించి, దశదిశలా భారతదేశం కీర్తిని రెపరెపలాడించాలని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని శివాలయం వీధి లోని నందిని క్లాత్ మార్కెట్ నందు బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ని ఆయన ప్రారంభించారు. ప్రొద్దుటూరు శాఖ సీఈఓ బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాజరయ్యి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. బ్లూ రిబ్బన్ ఫౌండర్ అండ్ చైర్మన్ సంతోష్ ఎమ్మెల్యే రాచమల్లుకు సాధార స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ఇప్పటికి దాదాపు పన్నెండు వేల మందికి ఉచితంగా వీసాలు తమ సంస్థ ద్వారా అందించామని, విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు తమ సంస్థ చక్కటి సేవలను అందిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ నియోజకవర్గంలో కన్సల్టెన్సీ సేవలు ప్రారంభించటం ఎంతో సంతోషదాయకమని, ఉన్నత విద్య అభ్యసించటానికి వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు ఇతర దేశాలలో సహాయపడే బ్లూ రిబ్బన్ సంస్థకు శుభాకాంక్షలు తెలియచేసారు.
Comments