దసరా నవరాత్రుల ఉత్సవ సందర్భంగా
బొమ్మల కొలువు
ADVERTISEMENT
దసరా నవరాత్రి, ముఖ్యంగా అమ్మవారి ఆరాధన కోసం చేస్తారు. అమ్మవారి అంశ అయిన బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఏడు, ఎనిమిది ఎండ్ల అమ్మాయి రూపం లో ఉంటుంది. ఆ వయసు అమ్మాయిలకు బొమ్మల పై ఆసక్తి ఎక్కువగా ఉండటం వల్ల మనం బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తే, ఆ అమ్మవారు మన బొమ్మల కొలువు నందు వచ్చి అక్కడే ఈ నవరాత్రులు ఉండి మనకు ఆశీస్సులు అందిస్తూ ఉంటుంది అని మన భావన.
ఈ బొమ్మల కొలువు లో ముఖ్యంగా విఘ్నేశ్వరుడు, లక్ష్మీ, పార్వతి, సరస్వతి... సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల వార్లు, దశావతారాలు, అష్ట లక్ష్ములు, ఇంకా అనేక దేవీ దేవతా మూర్తుల ప్రతిమలను ఉంచి పూజించటం జరుగుతుంది. బొమ్మల కొలువు కు ఆకర్షణ గా ప్రతీ సంవత్సరం.... ఒక ప్రత్యేక నేపథ్యం (Special Theme) కూడా ఏర్పాటు చేసి బాల బాలికలలో సృజనాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దొరసాని పల్లె పల్లె గ్రామంలోని సుబ్రహ్మణ్యం శర్మ (సెల్ 9032722209) ఏర్పాటు చేసిన హిమాలయాలు స్వర్గారోహణ సెట్, అలాగే ఇంకొక వైపు గోకులం, పల్లెటూరు సెట్ ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువు వల్ల భావితరాలకు మన ఇతిహాస, పురాణ పాత్రలను సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పవచ్చు.... అంతే కాక మన ఆచార వ్యవహారాలను తెలియచేసే అవకాశం ఉంటుంది.
Comments