top of page
Writer's pictureEDITOR

అన్నదమ్ముల కేసును చూసి షాక్ కు గురి అయిన జడ్జి

తల్లి కొరకు కోర్టు మెట్లు ఎక్కిన అన్నదమ్ములు - కేసును చూసి షాక్ కు గురి అయిన జడ్జి

విచిత్ర సంఘటన


ఇటీవల సౌదీ రియాద్ హైకోర్ట్ లో ఒక కేసు బెంచ్ ముందుకొచ్చింది. జడ్జి కేసు చదువుతుండగా కేసు వేసిన వారు అన్న దమ్ములు. అన్న వయస్సు 80 సం.రాలు, తమ్ముని వయస్సు 70 సం.రాలు. బహుశా ఇది ఆస్తి కి సంభందించిన కేసు ఏమో! ఇంత పెద్ద వయస్సులో వీరికి ఆస్తి ఎందుకో అనుకుంటూ కేసు పూర్తిగా చదివాకా జడ్జి కి దిమ్మ దిరిగింది. ఇంత వరకు ఇటువంటి కేసు తన ముందుకు రాలేదు. వారికి ఆస్తి పాస్తులు కూడ ఎక్కువ లేవు.

కేసు పూర్వ పరాలు ఏమిటంటే తన అన్న వద్ద తల్లి ( 110 సం.రాలు. ) గత 40 సం.రాలుగా ఉంటుంది. ఆలనా పాలన బాగానే చూసుకుంటాడు. తమ్ముని బాధ ఏమిటంటే తన తల్లిని తన వద్దకు పంపమని, సంవత్సరాల తరబడి ప్రాదేయబడ్డా కూడ తన అన్న తల్లిని తమ్ముని వద్దకు పంపడం లేదు. జడ్జి ఇద్దరినీ పిలిచి విడి విడిగా మీరే ఒక నిర్ణయానికి రండి అని అడిగాడు, కానీ ఇద్దరు అన్నదమ్ములు కూడ తల్లి తన వద్దనే ఉండాలని పట్టుబట్టారు. తుదకు తల్లిని స్ట్రెచ్చర్ లో కోర్టులో హాజరు పర్చారు. జడ్జి తల్లిని అడిగాడు ఎవరి వద్ద ఉంటావు అని, అప్పుడు ఆ తల్లి తనకు ఇద్దరు కుమారులు సమానమేననీ, ఇంతకన్నా ఏమి చెప్పలేనని, మీరు ఏం చెప్తే నేను అక్కడే ఉంటాను కానీ నేను ఎవరి మనసును గాయ పరిచలేను అంది.

జడ్జి ఇద్దరన్నదమ్ముల ఆరోగ్య సమాచారం సేకరించి తల్లిని తమ్ముని వద్ద ఉండాలని ఆదేశించాడు. ఆ ఆదేశాలతో అన్న అక్కడే కుప్పకూలి పోయాడు. ఇది ప్రేమ అంటే...ఈ రోజుల్లో తల్లి తండ్రులను పోషించలేక కొట్టి చంపడమో, లేక వృద్ధ శ్రమంలో చేర్పించడమో లేక వంతుల వారిగా పోషించడమో చూస్తున్నాము కానీ ఇటువంటి కేసు వినలేదు. తల్లి తండ్రుల పాదాల కింద స్వర్గం ఉంటుందని ఎంత మందికి తెలుసు. అందుకే తమ పిల్లలకు చిన్నప్పటి నుండి ఇంట్లో మరియు బడులలో వారి విలువలను గుర్తించేటట్లు బోధించాలి.

87 views0 comments

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page