బైకు దొంగల ముఠా అరెస్ట్, నిందితులు అందరూ చిట్వేలి మండలం పరిధిలోని వాసులుగా గుర్తింపు - నాలుగు వాహనాలు స్వాధీనం: ఎస్సై వెంకటేశ్వర్లు
గత ఏడాది నవంబర్ నెలలో చిట్వేలు మండల పరిధిలోని పలుచోట్ల బైకుల దొంగతనం కావడంతో 20/1/2022 తేదీన బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశామని, అందులో భాగంగా ఈరోజు ఉదయం చిట్వేలు మండల పరిధిలోని అనుంపల్లి గ్రామం దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో వారిని పట్టుకొని విచారించగా వారు గతంలో పలుచోట్ల బైకులు దొంగలించిన వారని నిర్ధారించబడింది.
నిందితుల వివరాలు:
1. కందుల బాలవర్ధన్ నాయుడు (24 ), 2. ఆవుల విష్ణు ప్రకాష్ (21), 3. తోదేటి పెంచలయ్య అలియాస్ చిన్న (24) లుగా గుర్తించామని, వీరు వయస్సు లో చిన్నవారు అయినప్పటికీ చెడు వ్యసనాలకు బానిసలై ఈ విధానాలకు పాల్పడుతున్నారని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
వీరి వద్ద నుంచి చిట్వేలి పోలీస్ స్టేషన్ కేసు లో నమోదైన రాయల్ ఎన్ఫీల్డ్, కావలి పోలీస్ స్టేషన్ కేసులో నమోదైన రాయల్ ఎన్ఫీల్డ్, రాజంపేట పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడ్డ పల్సర్ 220, మన్నూరు పోలీస్ స్టేషన్ నుంచి హోండా యాక్టివా 6G నాలుగు వాహనాలను స్వాధీనపరుచుకున్నమని వారందరినీ కోర్టుకు హాజరు పరుస్తామని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
అప్రమత్తత అవసరం:
ఒకప్పుడు సిటీ లకే పరిమితమైన వాహనాల దొంగతనాలు చిన్న పట్టణాలకు, మండలాలకు, గ్రామాలకు సైతం వ్యాపించిందని...వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనబడితే మాకు సమాచారం ఇవ్వాలని ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు తో పాటు పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు.
Comentarios