ఉక్కు నగరం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, విశాఖ ఉక్కు కర్మాగారం 100% స్టాటిస్టిక్స్ సేల్ వ్యతిరేకంగా పోర్టు కో స్టీల్ కార్మికుల ఆధ్వర్యంలో కాలనీలో ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంపదను ప్రజలకు కాకుండా కార్పొరేట్ శక్తులకు ఉచితంగా అందిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. వీటిని కాపాడుకోవడం ద్వారా మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆయన అన్నారు. పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ఈ ఉద్యమాలలో మనందరం భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కాలనీ సభ్యులు బి య్యన్ మధుసూదన్ మాట్లాడుతూ "సేవ్ ద పీపుల్ సేవ్ ద నేషన్" అన్న నినాదంతో కార్మిక వర్గం పోరాటాలను చేస్తున్నదని ఆయన అన్నారు. ప్రజల సంపద ప్రజలకే చెందాలని కొద్దిమంది చేతుల్లోకి వెళితే ఆది దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా పరిణమిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం ద్వారానే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, కనుక ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు యు రామ స్వామి మాట్లాడుతూ విశాఖ ఉక్కు లో పనిచేస్తున్న ప్రతి ఒక కార్మికుడు అకుంఠిత దీక్షతో ఉత్పత్తి చేస్తున్నాడని ఆయన వివరించారు. అందులో భాగమే బ్లాస్ట్ ఫర్నేస్ విభాగాల్లో అధిక ఉత్పత్తి జరుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతోనే నేడు పరిశ్రమలో ఉత్పత్తికి తీవ్ర అంతరాయాన్ని సృష్టిస్తున్నారని ఆయన వివరించారు. కనుక ఈ పరిస్థితులను అధిగమిస్తూ ఐక్య పోరాటాలు మరింత ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రతినిధులు కె ఆర్ కె రాజు, శ్రీ రామకృష్ణ, కాలనీవాసులు దశరథ్, సిహెచ్ సత్యనారాయణ, ఆర్ శ్రీనివాసులు, హుస్సేన్, పి శ్రీనివాస్ తదితరులతోపాటు అధిక సంఖ్యలో మహిళలు మరియు వృద్ధులు పిల్లలు పాల్గొన్నారు.
コメント