వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు స్థానిక వినాయక నగర్ నందు స్వీట్ దుకాణం నిర్వహిస్తున్న జస్వంత్ రామ్, తన పాత మారుతీ ఓమ్ని AP09BS2523 వాహనం లో దుకాణ సామాగ్రి తరలించటానికి సిద్ధంగా ఉండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం అగ్నికి ఆహుతి అయ్యింది. యజమాని పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. కారులో వాడుతున్న ఎల్.పి.జి సిలిండర్ కు ఎటువంటి అనుమతులు లేకపోగా, బ్యాటరీ దగ్గర మంటలు చెలరేగి కారు అంతా వ్యాపించాయి.
స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కారు వీధిలో పార్కింగ్ చేయటం దట్టమయిన మంటలు పైకి వ్యాపించడం వలన కరెంట్, కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కాలిపోయాయి. స్థానికులు కథనం మేరకు గ్యాస్ సిలిండర్ దగ్గర నుండే మంటలు వ్యాపించటం ఆరంభం అయ్యిందని, క్షణాల్లో మంటలు కారు మొత్తం వ్యాపించాయని తెలిపారు.
వేసవి కాలంలో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు వాహన యజమానులు తీసుకొవలసిన అవసరం ఎంతయినా ఉంది. ఇంజిన్ దగ్గర ఆయిల్ లీకేజి, అధికంగా పెట్రోల్ పట్టించడం, డీజిల్ లీకేజీ, బ్యాటరీ దగ్గర కట్ అయిన వైర్లు, గ్యాస్ లీకేజీ సరి చూసుకోవాలి.
Comments