పెరగనున్న సిమెంట్ ధరలు.. ఒక్క బస్తా ధర ఎంతంటే
దేశవ్యాప్తంగా సిమెంట్ ధర నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుండి బస్తాకు రూ.16 పెరిగింది. ఈ విషయాన్ని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తెలిపింది. కంపెనీ నివేదిక ప్రకారం, నవంబర్‌లో బస్తాకు దాదాపు రూ.6-7 వరకు ధరలు పెరిగాయి. దేశంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో ధరలు స్థిరంగా ఉండగా, ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాలలో ధరల్లో మార్పు కనిపించిందని ఎంకే గ్లోబల్ తెలిపింది.
అయితే ఈ నెలలో సిమెంట్ కంపెనీలు దేశవ్యాప్తంగా బస్తాకు రూ.10-15 వరకు ధరలను పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. ధరల పెంపుపై మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని ఎంకే గ్లోబల్ తెలిపింది. ACC, అంబుజా ద్వారా ఆర్థిక సంవత్సరం (డిసెంబర్ నుండి మార్చి వరకు) మార్పుతో ఈ కంపెనీలు తమ సరఫరాను పరిమితం చేసే అవకాశం ఉంది. “2023 ఆర్థిక సంవత్సరం క్యూ3లో సిమెంట్ ధరలు మెరుగుపడటంతో పాటు నిర్వహణ వ్యయాలు 2023లో గరిష్ట స్థాయికి చేరుకోవడంతో, 2023లో పరిశ్రమ లాభదాయకత రూ. 200 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం” అని ఆయా కంపెనీ యజమానులు పేర్కొంటున్నారు.
Comments