ఐదు రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్
న్యూఢిల్లీ, ఐదు రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్, లేఖ రాసిన రాజేష్ భూషణ్. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో కేంద్రం కోవిడ్స్ రూల్స్‌ను తొలగించింది. మరోవైపు, చైనా, యూకే కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ‍్యంలో కేంద్ర ప‍్రభుత్వం అలర్ట్ అయింది, కాగా, గత వారం రోజులుగా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది, దీంతో ఆ ఐదు రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. కేరళ, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అధికారులకు లేఖ రాశారు.
ఈ సందర్భంగానే దేశంలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ వెయ్యి కంటే తక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. దీంతో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్, వ్యాక్సినేషన్‌తోపాటు కరోనా మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించారు.
ఐదు రాష్ట్రాలు ఇవే :
★ ఢిల్లీలో ముగిసిన వారంలో 826కి పెరిగాయి. పాజిటివిటీ రేటు 0.51 శాతం నుంచి 1.25 శాతానికి పెరిగింది.
★ కేరళలో ముగిసిన వారంలో 2,321 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 13.45 శాతం నుంచి 15.33 శాతానికి పెరిగింది.
★ హర్యానాలో ఏప్రిల్ 8తో ముగిసిన వారంలో పాజిటివ్ కేసుల సంఖ్య 416కి పెరిగింది. కోవివ్ కేసుల పాజిటివిటీ 0.51 శాతం నుంచి 1.06 శాతానికి పెరిగింది.
★ మహారాష్ట్రలో ఏప్రిల్ 8తో 794 కేసులు నమోదయ్యాయి. 0.39 శాతం నుంచి 0.43 శాతానికి పాజిటివిటీ పెరిగింది.
★ మిజోరాంలో వారం వారీ కేసులు 814కి పెరిగాయి. రాష్ట్రంలో పాజిటివిటీ 14.38 శాతం నుంచి 16.48 శాతానికి పెరిగింది.
Comments