ప్రమాదాలపై శ్రీ చైతన్య విద్యార్థులు పోస్టర్ ప్రదర్శన
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
సమయం విలువైనదే కానీ.. ప్రాణం అంతకంటే విలువైనదని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరుతూ శుక్రవారం పట్టణ కేంద్రంలోని ఆర్ఎస్ రోడ్డు లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు రోడ్డు ప్రమాదాలపై పోస్టర్ ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఏజీఎం రమణయ్య, ప్రిన్సిపల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సైన్స్ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకే పది అంశాలతో కూడిన పోస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నల్స్ పై, వాహనాలు నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు చిత్రాల ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, హెల్మెట్, సీటు బెల్ట్ తప్ప సరిగా ధరించాలని, అధిక వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని విద్యార్థులు చిత్రాల ద్వారా తెలియజేశారన్నారు. తమ పాఠశాలలో చదివే విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక అంశాలపై కూడా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments