చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం
ప్రొద్దుటూరు పట్టణంలో గత పది నెలలుగా ప్రతి శనివారం సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్లా రాజగోపాల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక కొర్రపాడు రోడ్ లోని పాత బస్టాండ్ వద్ద శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని చల్లా రాజగోపాల్ ప్రారంభించారు. పాదచారులు, ప్రయాణికులు, నిరాశయులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని గత పది నెలలుగా ప్రతి శనివారం నెలకు నాలుగు సార్లు అన్నదానం నిర్వహిస్తున్నామని, ప్రతి పౌర్ణమి రోజు మైదుకూరు రోడ్ లోని టూ టౌన్ బైపాస్ వద్ద గల చిన్నమ్మ పెద్దమ్మ చెట్టు వద్ద అన్నదానం నిర్వహిస్తామని, అమ్మవారి దయవల్ల ఇప్పటికి అన్నదానం నిర్విరామంగా కొనసాగిస్తున్నానని చల్లా రాజగోపాల్ యాదవ్ తెలిపారు. భవిష్యత్తులో నెలలో ఇంకొక రెండు రోజులు పెంచి ఆరు రోజులు, పౌర్ణమి రోజున అన్నదానం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బలపనూరు శ్రీనివాసులు, మూరబోయిన శ్రీనివాసులు యాదవ్, నాగ ప్రసాద్, చింతల రాఘవేంద్ర యాదవ్, సీతంపల్లి రమణ, మంగి శివప్రసాద్, నల్లం శంకర్, కొండూరు వెంకటసుబ్బయ్య, గుడిసె హరీష్ ,ఉయ్యాల మధుసూదన్ రెడ్డి, ఆరేటి పల్లె హేమంత్, ఈశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments