చల్లా ఇక టిడిపి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గడచిన కొద్ది కాలంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం, ప్రజలలో అన్నదాతగా, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ, ప్రత్యేకించి జిల్లా రాష్ట్రవ్యాప్త యాదవ సంఘాలలో తనదైన శైలిని వ్యవహరిస్తూ అందరి చూపు మన్ననలు అందుకున్న చల్లా రాజగోపాల్ యాదవ్ 2018 మార్చిలో వైసీపీలో చేరారు. గత కొద్ది కాలంగా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై బాహాటంగా అసమ్మతి గళం వినిపించకపోయినా, తనకు మాట ఇచ్చిన నాయకులు ఆ మాట తప్పారని పలు సందర్భాలలో పలు ఇంటర్వ్యూలలో తన అసహనాన్ని వెళ్ళబుచ్చారు చల్లా.
ప్రొద్దుటూరు టిడిపి టికెట్ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని వరించటంతో ఆయన అభిమానులు, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయిన నేపథ్యంలో, పార్టీ మరింత బలోపేత దిశగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట చేరికలు అటు ఉంచితే, కొందరు బడా నాయకులు ప్రజలలో కుల సంఘాలలో గుర్తింపు గౌరవం ఉన్న నాయకులు టిడిపిలోకి రావడం ఆ పార్టీ గెలుపుకు మరింత బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలోనే గురువారం ఉదయం బీసీ సంక్షేమ సంఘం నాయకులు చల్లా రాజగోపాల్ యాదవ్ కడప టిడిపి ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి వరద సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టిడిపి అభ్యర్థి వరద మాట్లాడుతూ, బీసీ సంఘాల, యాదవ కులస్తుల నుండి బలమైన నాయకుడు చల్లా టిడిపిలో చేరటం సంతోషించదగ్గ విషయమని ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, దాదాపు రెండు వేల మంది చల్లా రాజగోపాల్ యాదవ్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comentários