విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్
ఆగస్టు 1న చలో కలెక్టరేట్ ని జయప్రదం చేయండి - ఎస్.ఎఫ్. ఐ
ప్రస్తుత విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమా?
0%అవును అవసరమే
0%లేదు అనవసరం
0%ఇప్పుడున్న పద్ధతి బాగుంది
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) ఆధ్వర్యంలో జరగనున్న చలో కలెక్టరేట్ ని జయప్రదం చేయాలని శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు పట్టణం లోని ప్రవేట్ పాఠశాలలో చలో కలెక్టరేట్ పోస్టర్స్ ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పట్టణ నాయకులు సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు అడుగులు వేగంగా ముందుకు వేస్తుందని అందులో భాగంగానే రోజుకొక జీఓ లు తీసుకొస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ను రాష్ట్రంలో శరవేగంగా అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే జీఓ నెంబర్ 117 ను తీసుకువచ్చి పాఠశాలల విలీనం పేరుతో ప్రాధమిక పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నారు. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాల కు తరలించడం ధ్వారా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులంతా డ్రాపౌట్స్ గా మిగిలే ప్రమాదం ఉందన్నారు. పాఠశాలలు తెరచి 20 రోజులు కావస్తున్నా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందన్నారు. పెండింగులో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. జీఓ నెంబర్ 77 వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా తీసుకువచ్చిన జీఓ లను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకొనేందుకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) ఆధ్వర్యంలో ఆగస్ట్ 1 న జరగనున్న చలో కలెక్టరేట్ లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ నాయకులు పాల్గొన్నారు.
Comments