చలో ఢిల్లీని జయప్రదం చేయండి - సిఐటియు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
రైతు మరియు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 5వ తేదీన చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం పురపాలక కార్యాలయంలో మున్సిపల్ కార్మికులతో సమావేశమై ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సి.రవికుమార్ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులకు, స్కీం వర్కర్లకు కనీస వేతనం 26,000 చేయాలని, 44 కార్మిక చట్టాలను రద్దు చేయాలని పని గంటలను తగ్గించాలని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశాన్ని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి మత రాజ్యాలుగా మార్చారని విమర్శించారు. ఏ మత ప్రస్తావన లేకుండా భారతదేశం లౌకిక రాజ్యాంగ మెలగాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని, నిర్బంధాల ద్వారా ఉద్యమాల అణచివేతకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మతోన్మాద బిజెపి నుండి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ఓబయ్య, లక్ష్మీదేవి, ప్రసాద్, రమణ తదితరులు పాల్గొన్నారు.
תגובות