కడప జిల్లా, ప్రొద్దుటూరు, పిఆర్సి సమస్యలపై 3న ఛలో విజయవాడను విజయవంతం చేయండి : ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు పదకొండవ పి.ఆర్.సి లో ఫిట్మెంట్ ను ఐ.ఆర్ కంటే ఎక్కువగా 30 శాతం గా ప్రకటించాలని, ఇంటి అద్దె అలవెన్సు లను యధావిధిగా కొనసాగించాలని రాష్ట పిఆర్సి సాధన సమితి పిలుపుమేరకు ఫిబ్రవరి మూడవ తేదీన చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక జార్జి క్లబ్ లో జరిగిన ఏపీటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ గత పది పిఆర్సి లలో లేని విధంగా పదకొండవ పిఆర్సి లో మాత్రమే ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఇచ్చారన్నారు, ఇంటి అద్దె అలవెన్సు లను గతంలో మాదిరిగా 12 శాతం 14.5శాతము ,20 శాతము ,30 శాతం గా కొనసాగించాలని, పెన్షనర్లకు 70 సంవత్సరాల కు అదనపు క్వాంటం పెన్షన్ ను కొనసాగించాలన్నారు. ఐదు సంవత్సరాలకు పిఆర్సి ని నియమించే విధానాన్ని కొనసాగించాలన్నారు. సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ను వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని పిఆర్సి సమస్యలపై ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి ఉద్యోగుల ఆందోళనను విరమించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి ,రాష్ట్ర కౌన్సిలర్ కుళ్ళాయిరెడ్డి,ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు సయ్యద్ భాష, జిల్లా కౌన్సిలర్లు జాన్ సురేష్ ,విజయకుమార్, శ్రీనివాసులు, మదన్ మోహన్ రెడ్డి, గురివి రెడ్డి, ప్రసాదరావులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments