పీఆర్సీ సాధన కమిటీ సభ్యులకు చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసుల అనుమతిలు లేవు అని ఏలూరు రేంజ్ డీఐజీ శ్రీ కె. వి. మోహన్ రావు ఐపీఎస్ వెల్లడి.
1. పిఆర్సి సాధన కమిటీ సభ్యులు ది 03.02.2022 వ తేదీ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో సదరు కార్యక్రమానికి పోలీసు వారి యొక్క అనుమతులు లేవని.
2. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి అని.
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఉత్తర్వులు మరియు వైద్య ఆరోగ్య శాఖ గైడ్లైన్స్ ప్రకారం బహిరంగ ప్రదేశాలలో ఎక్కువ మంది ఉండడం వలన కరోనా వైరస్ వ్యాప్తి కారణభూతులు అవుతున్న నేపథ్యంలో.
4. ఏలూరు రేంజి పరిధిలో తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం అర్బన్, పశ్చిమగోదావరి జిల్లా మరియు కృష్ణా జిల్లాల ప్రాంతాలలో ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం విజయవాడ పిఆర్సి సాధన కమిటీ సభ్యులు ఎక్కువగా తరలివస్తారు అనే సమాచారం ఉన్నట్లు.
5. పిఆర్సి సాధన కమిటీ సభ్యులు ఎక్కువ మంది బయటకు వచ్చి ఉండటం వలన కరోనా వైరస్ వ్యాప్తి కీ దోహదపడతారు అని, ఉద్యోగస్తులు తిరిగి వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ వ్యాప్తి కీ కారణము అవుతారు అని.
6. ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం అర్బన్, పశ్చిమ గోదావరి జిల్లా మరియు కృష్ణా జిల్లాలలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మరియు 144 సీఆర్పీసీ అమలులో ఉన్నాయని, కావున ఐదు మంది కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమ్ముకుడి ఉండరాదని.
7. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పిఆర్సి సాధన కమిటీ సభ్యులు ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడం చట్టపరంగా గానే కాకుండా ఎంప్లాయిస్ కాండాక్ట్ రూల్స్ కు కూడా విరుద్ధమని.
8. సదరు కారణాల దృష్ట్యా పిఆర్సి సాధన కమిటీ సభ్యులు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతులు పోలీస్ శాఖ నిరాకరించినట్లు, కావున ప్రభుత్వ ఉద్యోగాల వారి యొక్క ఆరోగ్య దృశ్య చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనవద్దని ఏలూరు రేంజ్ డిఐజి గారు పిఆర్సి సాధన కమిటీ సభ్యులకు హితవు పలికినారు.
9. పోలీసు వారు విధించిన ఆంక్షలను ఉల్లంఘించి విజయవాడ వెళ్లి నిరసన తెలపాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, ఏలూరు రేంజ్ డీఐజీ శ్రీ కె వి మోహన్ రావు ఐపీఎస్ ఐపీఎస్ వారు పత్రికా ప్రకటన ద్వారా తెలియ చేసినారు.
Comments