జగనన్న ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఇవ్వాలని చలో విజయవాడ
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చాలీచాలని ఒకటిన్నర సెంటు స్థలము ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని మొదట్లో చెప్పి ఇప్పుడు మీరే కట్టుకోవాలని చెప్పి 1,80,000 మాత్రమే డబ్బులు ఇవ్వడం అది చాలదని భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) గా ఈనెల 22న జగనన్న కాలనీలకు ఐదు లక్షల కేటాయించాలని ఇసుక సిమెంటు ఇనుము ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు. ఆదివారం ఉదయం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి మహేష్ తెలిపారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత నెల 17 నుండి 30వ తేదీ వరకు జగనన్న కాలనీలో పరిశీలన చేసే వారి బాధలు చూసామని చాలా వరకు చాలీచాలని డబ్బులతో ప్రభుత్వం ఇస్తున్నటువంటి లక్ష్యా 80 వేల రూపాయలు బేస్ మఠం కే సరిపోతున్నదని అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా కూడా ఇవ్వకుండా ఇల్లు నిర్మించుకోవడం చాలా దారుణమని మన పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు గవర్నమెంటు పేదలకు ఇంటి నిర్మాణం కోసం 4,50,000, కేరళ ప్రభుత్వం 4,80,000 ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమని అవునా జగనన్న కాలనీలకు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల కేటాయించి ఇసుక ఇనుము సిమెంటు ఫ్రీ గా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈనెల 13వ తేదీ నుండి సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటితో పారుదల ప్రాజెక్టుల పరిశీలన జరుగుతున్నదని అందులో భాగంగా ఈనెల 15, 16 వ తేదీలలో అన్నమయ్య జిల్లాలో సిపిఐ రాష్ట్ర బృందం ప్రాజెక్టులో పరిశీలన చేస్తుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శులు ఎమ్మెస్ రాయుడు, ఎం. శివరామకృష్ణదేవరా, పట్టణ కార్యదర్శి ఈ సికిందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Комментарии