ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం, సామాజిక మాధ్యమాలపైనే ఆశలు - టిడిపి నేత చమర్తి జగన్ రాజు ధ్వజం
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం నమ్మకం కోల్పోయే సామాజిక మాధ్యమాలపై ఆధారపడాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు ముఖ్యమంత్రి హితబోధ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జగన్ రాజు ఎద్దేవా చేశారు.
సోమవారం తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో రోజురోజుకు జనం మద్దతు కోల్పోతున్న వైసిపి సర్కార్ గత ఎన్నికల్లో లాగా ఈ ఎన్నికల్లో కూడా సామాజిక మాధ్యమాలలో జిమ్మిక్కులు చేసి అధికారంలోకి రావాలని చూస్తోందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్రులు వైకాపా అభ్యర్థులకు వాత పెట్టారని., అయితే మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశాల్లో ఈ గెలుపు చూసి తెలుగుదేశం బలుపు అనుకుంటుందని ముఖ్యమంత్రి మాట్లాడటం ఎన్నికల్లో ఓటు ద్వారా పాలక పక్షం పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ఓర్వలేక అహంతో మాట్లాడినట్లు కనిపిస్తోందన్నారు.
108 నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రులు వేసిన ఓట్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం.. అధికారంలో ఉన్నామని అహంకారంతో ఉన్నట్లేనని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర చూసి ఒకవైపు వణికిపోతూ గడపగడపకు పోవాలని ఎమ్మెల్యేలకు చెబుతున్నారని, ఇప్పటివరకు జనంలోకి వైకాపా ప్రజాప్రతినిధులు ఏ మేరకు వెళ్లారో సీఎం మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోందన్నారు. నేల విడిచి సాము చేయడం అంటే ఈ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. జనం బలంతోనే లోకేష్ పాదయాత్ర విజయవంతమవుతున్న విషయం చూసి ఎమ్మెల్యేలకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సీఎం సూచించడం చూస్తే మరోసారి జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోందన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనం ఈ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈకార్యక్రమంలో అయన వెంట రాజంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎద్దుల సాగర్, ముస్లిం మైనారిటీ నాయకులు కరీముల్లా, మండల సీనియర్ నాయకులు జీ.వి సుబ్బరాజు, పార్టీ నాయకులు గోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments