వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి నేడు ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, రేపు జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారని, నియోజకవర్గ నాయకులు పార్టీ కార్యకర్తలు వేలాదిగా పాల్గొని కమలాపురంలో జరగబోవు భారీ భహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కడప జిల్లాలో పది నియోజకవర్గాలుండగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుండి కమలాపురం నియోజకవర్గానికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు స్థానం ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మొదలు నేటికి కూడా ఇక్కడి నాయకులకు ఒక ప్రత్యేక గౌరవం గుర్తింపు రాష్ట్ర స్థాయిలో ఉన్నాయనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేసుకొని చంద్రబాబు జిల్లాలోని కమలాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అని ఆ పార్టీలో అంతర్గతంగా చెర్చించుకుంటున్నారు. రేపటి చంద్రబాబు పర్యటన జిల్లాలో టీడీపీ నేతలలో కార్యకర్తలలో కొత్త ఉత్సాహం తీసుకురానుందా అనేది జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా చెర్చించుకుంటున్నారు. కాగా రేపటి చంద్రబాబు సభనుద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆధ్యంతం ఉత్కంఠ రేపుతోంది.
ఇకపోతే రేపటి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు, చంద్రబాబు కడప విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి భారీ కాన్వాయ్ తో రాజంపేట బైపాస్ లో గల డి.ఎస్.ఆర్ కళ్యాణమంటపం చేరుకొని సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు, తదనంతరం చెన్నూరు, ఖాజీపేటలో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో పాల్గొని, అటుపిమ్మట కమలాపురం చావిడి నందు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభనుద్దేశించి మాట్లాడనున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రేపటి చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments