top of page
Writer's picturePRASANNA ANDHRA

చంద్రయ్య హత్య కేసులో నిందితుల అరెస్ట్

గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయములోని అర్బన్ కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపాడు గ్రామంలో నిన్న(13.01.2022) తేదీన ఉదయం జరిగిన హత్యకు సంబంధించి వివరాలను శ్రీ ఎస్పీగారు వెల్లడించడం జరిగినది

నిన్న ఉదయం సుమారు 7 గంటల సమయంలో గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య ద్విచక్రవాహనంపై బజారుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా చింతా.శివరామయ్య మరియు 7గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారవడం జరిగినది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందడం జరిగినది, ఘటన జరిగిన స్థలంలో లభించిన అన్ని ఆధారాలను సేకరించి, తదుపరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తగిన చర్యలు తీసుకోవడం జరిగినదని, మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు మొత్తం 8 మంది నిందితులపై హత్య కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకోవడానికి 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ముమ్మర గాలింపు చేపట్టడం జరిగినది.


ఈ హత్యకు ప్రధాన కారణం పాత తగాదాలు అని మా ప్రాధమిక దర్యాఫ్తులో తెలినది. మృతుడు తోట చంద్రయ్య మరియు చింతా శివ రామయ్య గుండ్లపల్లి గ్రామంలో ఒకే ప్రాంతంలో నివసిస్తుంటారు. వారు ఒకే కులం, సామాజిక వర్గానికి చెందిన వారు. గతంలో మృతుడు తోట చంద్రయ్య మరియు ముద్దాయి చింతా శివ రామయ్య మధ్య వారి ప్రాంతంలో వేసే సిమెంట్ రోడ్డు విషయంలో మధ్య గొడవలు జరిగాయని, అప్పటినుండి వారి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన గ్రామంలో తమ బంధువుల కుమార్తె ఓణీల కార్యక్రమము జరుగగా ఆ గ్రామానికి హాజరైన బంధువులతో తోట చంద్రయ్య, చింతా శివరామయ్యను చంపుతానని చెప్పగా ఆ విషయం చింత శివరామయ్యకు తెలియగా అతని చంపడానికంటే ముందే నేనే అతన్ని చంపాలని శివరామయ్య, తన కుమారుడు మరియు 6 గురు అనుచరుల సహాయంతో నిన్న హత్య చేయడం జరిగినది.


ముద్దాయిల వివరాలు:-


1.చింత శివ రామయ్య S/O పెద రామ కోటయ్య, 62 సంవత్సరాలు,

2.చింత యలమంద కోటయ్య S/O నారాయణ, 52 సంవత్సరాలు,

3.సాని రఘు రామయ్య S/O శంకరయ్య, 54 సంవత్సరాలు,

4.సాని రామకోటేశ్వరరావు S/O శంకరయ్య, 40 సంవత్సరాలు,

5.చింతా శ్రీనివాసరావు S/O శివ రామయ్య, 36 సంవత్సరాలు,

6. తోట ఆంజనేయులు S/O రాములు, 36 సంవత్సరాలు,

7. తోట శివ నారాయణ S/O హనుమయ్య, 38 సంవత్సరాలు,

8.చింతా ఆదినారాయణ S/O శివ రామయ్య, 35 సంవత్సరాలు,


24 గంటల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన గురజాల డిఎస్పీ M. జయరాం ప్రసాద్, మాచర్ల రూరల్ సీఐ సురేంద్రబాబు ల, ఎస్సైలు అనిల్ కుమార్ రెడ్డి, పాల్ రవీందర్ ఇతర అధికారులు మరియు సిబ్బందిని అభినందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.


42 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page