తిరుమల బ్రేక్ దర్శనంలో మార్పులు
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు తితిదే తెలిపింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునేఅవకాశం ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి ప్రస్తుతం దాదాపు 30 గంటలు పడుతోందని తితిదే తెలిపింది.
లడ్డూ కౌంటర్ కాంట్రాక్ట్ సంస్థపై ఎస్మా
తిరుమల లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని నిర్వహిస్తున్న కేవీఎం కాంట్రాక్టు సంస్థపై తితిదే ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. భక్తులకు ఇబ్బంది కలిగించే సమ్మెలు, ఆందోళన లు చేపట్టకూడదని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎస్మా చట్టాన్ని తితిదేలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలోని కొందరు కేవీఎం సిబ్బంది తమకు కాంట్రాక్టు సంస్థ జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఇటీవల కొంతసేపు విధులకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో తితిదే చర్యలు తీసుకుంది.
Comments