top of page
Writer's picturePRASANNA ANDHRA

దొంగల్ని పట్టిస్తే పది వేల రూపాయలు... పోలీసుల బంపరాఫర్..!

దొంగల్ని పట్టిస్తే పది వేల రూపాయలు.. పోలీసుల బంపరాఫర్..!

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఓలేటి సువర్చల అనే వృద్ధురాలు బుధవారం మధ్యాహ్నం తన ఇంటి ముందు ఊడుస్తుంది. అదే సమయంలో బైక్‌పై అటుగా వచ్చిన ఇద్దరు యువకులు వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసు అపహరించారు. ఆ దుండగుల ఆచూకీ చెప్తే పది వేల రూపాయలు ఇస్తామంటూ పోలీసులు బంపరాఫర్ ఇచ్చారు.

ఐకమత్యంతో.. కలిసికట్టు సహకారంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఆ ఫార్ములాను మన పోలీసులు కూడా నమ్మారు. సమాజంలో జరిగే అన్యాయాల్లో ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయితే చాలా నేరాలు అదుపులోకి వస్తాయనుకున్నారు. ఆ సహకారానికి కాస్తంత సాయం అందిస్తే.. ఇంకాస్త త్వరగా పనవుతుందని నజరానా ఆఫర్ కూడా పెట్టేశారు. దాంతో చైన్ స్నాచర్స్‌ని పట్టుకోవడంలో ఇప్పుడు పోలీసులతో పాటు ప్రజలు కూడా మునిగిపోయారు

వివరాల్లోకి వెళ్తే.. కాకినాడా జిల్లా పిఠాపురంలో ఓలేటి సువర్చల అనే వృద్ధురాలు బుధవారం మధ్యాహ్నం తన ఇంటి ముందు ఊడుస్తుంది. అదే సమయంలో బైక్‌పై అటుగా వచ్చిన ఇద్దరు యువకులు ఏదోకటి మాట్లాడాలనే వంకతో.. బంగారమ్మ తల్లి గుడికి ఎటెళ్లాలి అంటూ అడ్రస్ అడిగారు. వాళ్లకి అడ్రస్ చెప్పే లోపే బైక్‌పై వెనుకు కూర్చున్న వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొన్నాడు. ఆ తర్వాత ఆ ఇద్దరూ బైక్‌పై అక్కడ నుంచి ఉడాయించారు.

బాధితురాలు ఓలేటి సువర్చల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పిఠాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దగ్గరలోనే సీసీ టీవీ కెమెరాలు ఉండటంతో ఫుటేజీని పరిశీలించి వృద్ధురాలు సాయంతో నిందితులను గుర్తించారు. చైన్ స్నాచర్స్ ఇద్దరూ బైక్‌పై పరారవుతున్న ఫొటోనే దగ్గర్లోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు పంపించడంతో పాటు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చైన్ స్నాచర్స్ ఫొటోలను సోషల్ మీడియాతో పాటు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఉంచి.. వీళ్ల ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేల నజరానా ఇస్తామంటూ ప్రకటించారు. ఒకవేళ మీలో కూడా వీళ్లని ఎవరైనా చూస్తే 9440796505, 9440796523, 9440796560 నంబర్లలో పోలీసులకు సమాచారం అందించొచ్చు.

20 views0 comments

Commenti

Valutazione 0 stelle su 5.
Non ci sono ancora valutazioni

Aggiungi una valutazione
bottom of page