వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
స్థానిక మునిసిపల్ నాలుగవ వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి నేటి సాయంత్రం వైఎంఆర్ కాలనీలోని తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ లక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానం గురించి టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, రాఘవా చార్యులు అకాల మరణం తరువాత, కారుణ్య నియామకం క్రింద అతని భార్యకు కారుణ్య నియామకం క్రింద స్థానిక అగస్తేశ్వర ఆలయం నందు ఎండోమెంట్స్ శాఖ ఉద్యోగం కల్పించిందని, గతంలో అనగా 2018వ సంవత్సరము నందు రాఘవా చార్యులు భార్య మాధవి లత లిఖితపూర్వకంగా తన బిడ్డలు ఉన్నత చదువులు అభ్యసిస్తూ, పౌరోహిత్యం పట్ల పూర్తి అవగాహన లేనందున, తనకే ఉద్యోగ అవకాశం కల్పించాలని ఈఓ ని కోరగా, నాడు కారుణ్య నియామకం చేపట్టారని. కాగా మాధవి లత ఇద్దరు కుమారులు తన తాత చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు పౌరోహిత్యం చేస్తున్నందున, వారు కూడా పౌరోహిత్యం నేర్చుకొని, అది కాస్త ఆసరాగా చేసుకొన్న వీరు అహంకార పూరితమైన స్వార్ధంతో, భక్తులకు అసౌకర్యం కలిగించేవారని, దసరా ఉత్సవ కమిటీ లోని సభ్యునిపై కూడా అనుచితంగా ప్రవర్తించారని, లక్షల రూపాయల వ్యయంతో జరుపుతున్న దసరా ఉత్సవాలకు కూడా ఆటంకంగా మారారని తెలిపారు.
కాగా దేవస్థానం నందు జరుగుతున్న అసౌకర్యాన్ని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే దృష్టికి దసరా కమిటీ తీసుకురాగా, ఎమ్మెల్యే రాచమల్లు ఈఓ ని వివరణ కోరారని, జరిగిన విషయాలు వాస్తవమేనని ఈఓ చెప్పగా, తదుపరి చర్యలకు ఉపక్రమించమని ఎమ్మెల్యే ఆదేశించారని, స్థానికంగా ఏ సమస్య ఉన్న ఎమ్మెల్యే తీరుస్తున్నందునే దసరా కమిటీ సభ్యులు ఆయన దగ్గరకు వెళ్లారని అందులో తప్పు లేదని తెలిపారు. పేద బ్రాహ్మణులకు అన్యాయం జరగకుండా ఎమ్మెల్యే చెప్పారని, ఈఓ నోటిఫికేషన్ ఇవ్వకుండా తొలగింపు చేయటం సబబు కాదని, ఈఓ పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తనను ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులు ముందుగా వాస్తవాలు తెలుసుకోవాలని, భక్తుడిగా తాను ఆలయానికి వెళ్లానని, టీడీపీ నాయకులు తమ ఉనికి కాపాడుకోవటానికి వైసీపీ నాయకులపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కారుణ్య నియామకం క్రింద కుటుంబానికి ఒకటే ఉద్యోగం వస్తుందని కూడా తెలియకుండా టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో మునిసిపల్ నాలుగవ వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకుడు కాకర్ల నాగ శేషారెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి పగిడాల దస్తగిరి, వైసీపీ నాయకులు రాయపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comentarios