చెన్నకేశవ... పేద అర్చక బ్రాహ్మణులపైన అసత్య ప్రచారాలా...
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
శ్రీ లక్ష్మి సామెత చెన్నకేశవ స్వామి దేవస్థాన అర్చకుల వివాదం పై స్పందించిన టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి జీ.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి నేడు తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక అధికార పార్టీ నాయకుడు దేవస్థాన తాళాలు తీసుకొవటం తప్పు అని అలాగే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అర్చకులను తొలగించటం తప్పు అని, తాను ఈఓ సమక్షంలోనే అర్చకుల తొలగింపుకు గల కారణాలు అడిగానని, ఆలయ ప్రాంగణంలో తాను ధర్నాకు చేయలేదని, ఈఓ విధులకు ఆటంకం కలిగించినట్లు తనపై రెండవ పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయటం ఏమిటని ప్రశ్నించారు. ఈఓ తో తనపై ఫిర్యాదు చేయించిన వారే తిరిగి ఈఓ ను సస్పెండ్ చేయమని కోరటం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా నిన్న రాత్రి తొలగించిన అర్చకులకు దేవస్థాన తాళాలు ఇవ్వటం సంతోషించదగ్గ విషయం అని అన్నారు.
పేద అర్చక బ్రాహ్మణులపైన అసత్య ప్రచారాలు, నిందలు మోపటం సమంజసం కాదని, తాను ఎన్నడూ ఇతరుల ఆస్తులు జోలికి వెళ్లలేదని తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని, దర్గా ప్రహారి గోడ పునః నిర్మాణం చేపట్టినందుకు తాము సంతోషిస్తున్నామని, ఇకనైనా తనపై అవాస్తవాలు ప్రచారం చేయటం మానుకోవాలని హితువు పలికారు.
Kommentare