అన్నమాచార్యలో ముగిసిన జేఎన్టీయూ చెస్ శిక్షణా శిభిరం
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
గత మూడు రోజులుగా అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న జె ఎన్ టీ యూ చెస్ శిక్షణ శిబిరం గురువారంతో ముగిసింది. గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన జెఎన్టీయూ ఇంట్రా యూనివర్సిటీ చెస్ ఎంపికలలో తమ కళాశాల నుంచి ఎంపికైన ఆరుమంది విద్యార్థులకు గత మూడు రోజులుగా కళాశాలలో చెస్ శిక్షణా శిబిరం నిర్వహించడం జరిగిందని.. అది నేటితో ముగిసిందని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి తెలియజేశారు. ఎంపికైన ఆరు మంది విద్యార్థులకు గత మూడు రోజులుగా తమ కళాశాల నందు చెస్ శిక్షణా శిభిరం నిర్వహించగా విద్యార్థులు ఈనెల 10వ తేదిన సౌత్ జోన్ ఇంట్రా యూనివర్సిటీ ఎస్.ఆర్.ఎం ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చైన్నై నందు జరగబోయే చెస్ కాంపిటేషన్స్ లో విద్యార్థులు పాల్గొంటారని ఆయన తెలిపారు. పోటీలలో పాల్గొనే విద్యార్థులకు ఆయన గురువారం యూనివర్సిటీ క్రీడా దుస్తులను అందజేశారు. చెస్ కాంపిటీషన్ కు ఎంపికైన విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించాలని ఈ సందర్బంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.మల్లికార్జునరావు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.నాగముని, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments