భారీగా పడిపోయిన చికెన్ ధరలు..
ఇక చికెన్ ప్రియులకు పండుగే పండుగ..!
శ్రావణ మాసం ఎఫెక్ట్ తో మొన్నటి వరకు ట్రిపుల్ సెంచరీ దాటిన చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. ఈ మాసంలో చాలా మంది మాంసాహారాన్ని ముట్టకపోవడం, అధిక ధరల కారణంగా వినియోగదారులు చికెన్ కొనుగోలు చేసేందుకు వెనకంజ వేయడంతో డిమాండ్ లేక మరోసారి చికెన్ రేటు తగ్గుముఖం పట్టింది. దాదాపు రెండు నెలల పాటు కిలోకు రూ.300 నుంచి రూ.340 వరకు పలుకగా, గడిచిన వారం రోజుల్లో ఏకంగా రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో లైవ్ బర్డ్ రూ.130, కిలో స్కిన్ తో రూ.200, స్కిన్ లెస్ రూ.230లుగా సోమవారం నుంచి విక్రయిస్తున్నారు. మరో రెండు, మూడు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని చికెన్ సెంటర్ల యజమానులు తెలపారు.
Comments