కొత్తపల్లె సచివాలయాలను పరిశీలించిన చీఫ్ ఇంజినీర్
కడపజిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధలోని కొత్తపల్లె పంచాయతీ కానపల్లెలో నూతనంగా నిర్మిస్తోన్న గ్రామ సచివాలయం, వైస్సార్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం పనులను గురువారం ఉదయం MGNREGS చీఫ్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, క్వాలిటీ కంట్రోల్ అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ లకు సూచనలు సలహాలు ఇచ్చారు. జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, సచివాలయ ప్రాంగణానికి యాబై సెంట్ల స్థలం ఇచ్చిన కొత్తపల్లె సర్పంచ్ కడప జిల్లా సర్పంచులు సంఘ అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి దాతృత్వాన్ని అభినందించారు. కొత్తపల్లె ఒకటవ సచివాలయాన్ని కూడా సందర్శించి, అక్కడ విజిటర్స్ డైరీ పరిశీలించారు. అక్కడి సచివాలయ సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, యువ నాయకుడు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి చీఫ్ ఇంజినీర్ కృష్ణారెడ్డి కి ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ డీ ఈ -హరనాథ్, ఈఈ నాగేశ్వర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శ్యాం సుందర్ రాజు, అసిస్టెంట్ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments